విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: అధికారులు
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి బ్యూరో)
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సెప్టెంబర్ 23, 2026 (బుధవారం) అన్ని పాఠశాలలకు పరిహార సెలవు (Compensatory Holiday) ప్రకటించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఈ సెలవును అమలు చేయాలని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అవసరం లేకుండా విద్యార్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు, నీటి ప్రవాహాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలకు బుధవారం పరిహార సెలవు ప్రకటించిన విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని అధికారులు కోరారు.


