Thursday, 3 September 2026
  • Home  
  • హిట్ అండ్ రన్ ప్రమాద బాధితులకు అండగా జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి
- విజయనగరం 

హిట్ అండ్ రన్ ప్రమాద బాధితులకు అండగా జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి

*హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాద బాధితులకు అండగా జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి* *7 కేసులకు రూ.8 లక్షల పరిహారం చెల్లించుటకు సిఫార్సు* *3 మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున.. 4 గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం* *వర్చువల్‌ పరిహార కమిటీ సమావేశంలో కేసుల పరిశీలన – ఆమోదం* *హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు సత్వరం సహాయం అందాలి* – జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి విజయనగరం, జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. ( పున్నమి ప్రతినిధి) రహదారి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. హిట్‌ అండ్‌ రన్‌/రహదారి ప్రమాద పరిహారానికి సంబంధించి నిర్వహించిన వర్చువల్‌ పరిహార కమిటీ సమావేశంలో మొత్తం 7 కేసులను పరిశీలించి, అర్హత కలిగిన బాధితులకు రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో విజయనగరం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మణికుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, ఇతర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధి వినోద్‌ తదితరులు 7 కేసులకు రూ.8 లక్షల పరిహారం పరిహార కమిటీ సమావేశంలో ప్రమాదాలకు సంబంధించిన రికార్డులు, కేసు నివేదికలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వివరాలను సమగ్రంగా పరిశీలించారు.మరణించిన వారి కేసులు – 3 ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.6 లక్షలు పరిహారం అందించేందుకు సిఫార్సు చేశారు. గాయపడిన వారి కేసులు – 4: ఒక్కో బాధితుడికి రూ.50 వేల చొప్పున, మొత్తం రూ.2 లక్షలు పరిహారం సిఫార్సు చేశారు. 3 మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, 4 మంది గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది. రికార్డుల ఆధారంగా పారదర్శకంగా పరిశీలన ప్రమాదాలకు సంబంధించిన పోలీసు కేసు వివరాలు, ప్రమాద రికార్డులు, వైద్య సంబంధిత పత్రాలు, పరిహారానికి సంబంధించిన ఇతర ఆధారాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న కేసులకు పరిహారంనకు సిఫార్సు చేశారు.సమావేశంలో కమిటీ సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో మొత్తం 7 కేసులకు పరిహారం సిఫార్సు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.ఇన్సూరెన్స్‌ సంస్థకు ఫైలు పంపించి నిధుల విడుదల కమిటీ నిర్ణయం అనంతరం సభ్యులందరి డిజిటల్‌ లేదా భౌతిక సంతకాలు పూర్తిచేసి సంబంధిత ఫైలును జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థకు పంపనున్నట్లు అధికారులు కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి కి వివరించారు. తదుపరి నిబంధనల ప్రకారం పరిహారం మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు బాధిత కుటుంబాలు పరిహారం కోసం అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించడంతో పాటు, గాయపడిన బాధితులకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని “ప్రమాద బాధితులకు తక్షణ సహాయం – అర్హులకు సత్వర పరిహారం – పారదర్శకంగా కేసుల పరిష్కారం” అనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు ఈ సమావేశం ద్వారా 7 ప్రమాద బాధిత కేసులకు మొత్తం రూ.8 లక్షల పరిహారం సిఫార్సు చేయడం ద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులు బాధితులకు సత్వర సహాయం అందించడానికి సమన్వయంతో కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ఇతర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాద బాధితులకు అండగా జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి*
*7 కేసులకు రూ.8 లక్షల పరిహారం చెల్లించుటకు సిఫార్సు*
*3 మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున.. 4 గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం*
*వర్చువల్‌ పరిహార కమిటీ సమావేశంలో కేసుల పరిశీలన – ఆమోదం* *హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు సత్వరం సహాయం అందాలి* – జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి

విజయనగరం, జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. ( పున్నమి ప్రతినిధి)

రహదారి ప్రమాదాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. హిట్‌ అండ్‌ రన్‌/రహదారి ప్రమాద పరిహారానికి సంబంధించి నిర్వహించిన వర్చువల్‌ పరిహార కమిటీ సమావేశంలో మొత్తం 7 కేసులను పరిశీలించి, అర్హత కలిగిన బాధితులకు రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది.
జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో విజయనగరం జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మణికుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీవన్ రాణి పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు, ఇతర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధి వినోద్‌ తదితరులు 7 కేసులకు రూ.8 లక్షల పరిహారం
పరిహార కమిటీ సమావేశంలో ప్రమాదాలకు సంబంధించిన రికార్డులు, కేసు నివేదికలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వివరాలను సమగ్రంగా పరిశీలించారు.మరణించిన వారి కేసులు – 3 ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున, మొత్తం రూ.6 లక్షలు పరిహారం అందించేందుకు సిఫార్సు చేశారు. గాయపడిన వారి కేసులు – 4: ఒక్కో బాధితుడికి రూ.50 వేల చొప్పున, మొత్తం రూ.2 లక్షలు పరిహారం సిఫార్సు చేశారు. 3 మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, 4 మంది గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.8 లక్షల పరిహారం అందించేందుకు కమిటీ సిఫార్సు చేసింది.
రికార్డుల ఆధారంగా పారదర్శకంగా పరిశీలన
ప్రమాదాలకు సంబంధించిన పోలీసు కేసు వివరాలు, ప్రమాద రికార్డులు, వైద్య సంబంధిత పత్రాలు, పరిహారానికి సంబంధించిన ఇతర ఆధారాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న కేసులకు పరిహారంనకు సిఫార్సు చేశారు.సమావేశంలో కమిటీ సభ్యుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో మొత్తం 7 కేసులకు పరిహారం సిఫార్సు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.ఇన్సూరెన్స్‌ సంస్థకు ఫైలు పంపించి నిధుల విడుదల కమిటీ నిర్ణయం అనంతరం సభ్యులందరి డిజిటల్‌ లేదా భౌతిక సంతకాలు పూర్తిచేసి సంబంధిత ఫైలును జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థకు పంపనున్నట్లు అధికారులు కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి కి వివరించారు. తదుపరి నిబంధనల ప్రకారం పరిహారం మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు బాధిత కుటుంబాలు పరిహారం కోసం అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సమావేశం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా
రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించడంతో పాటు, గాయపడిన బాధితులకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని
“ప్రమాద బాధితులకు తక్షణ సహాయం – అర్హులకు సత్వర పరిహారం – పారదర్శకంగా కేసుల పరిష్కారం” అనే లక్ష్యంతో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు
ఈ సమావేశం ద్వారా 7 ప్రమాద బాధిత కేసులకు మొత్తం రూ.8 లక్షల పరిహారం సిఫార్సు చేయడం ద్వారా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే సహాయాన్ని వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులు బాధితులకు సత్వర సహాయం అందించడానికి సమన్వయంతో కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ
సమావేశంలో పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ఇతర లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.