Saturday, 17 January 2026
  • Home  
  • సీసీ పుటేజీ లేకుంటే ఉషారాణి ఉద్యోగం ఉడీస్‌…
- Featured - ఆంధ్రప్రదేశ్

సీసీ పుటేజీ లేకుంటే ఉషారాణి ఉద్యోగం ఉడీస్‌…

‌టూరిజం హోటల్‌ ‌దాడి ఘటనలో వెలుగుచూస్తున్న కొత్త దాష్టీకాలు నిధుల వ్యయం పైన ఆరోపణలు నెల్లూరు, జూలై 01, 2020 (పున్నమి ప్రతినిధి) : రాష్ట్రంతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచ లనం…. ప్రజల్లో ఆగ్రహావేశాలు కలి గించిన టూరిజం హోటల్‌లో అడ్మిన్‌ ‌డిప్యూటీమేనేజర్‌ ‌భాస్కర్‌ అక్కడి తాత్కా లిక ఉద్యోగిని ఉషారాణి పై దాడి ఘట నలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సభ్య సమాజం తలదిం చుకునేలా మానవత్వానికి మాయని మచ్చలా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడి అనంతరం మరో దారుణానికి సిద్ధమైనట్లు సమాచారం తెలిసింది. గత నెల 27న మధ్యాహ్నం కార్యాలయంలో ఉషారాణి పై విచక్షణా రహితంగా దాడిచేసిన భాస్కర్‌ను రక్షించేందుకు అక్కడి డివిజన్‌ ‌స్థాయి అధికారులతో పాటు కొందరు సిబ్బంది పథకం రచించినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉషారాణి ఆసుపత్రిలో చికిత్స పొందు చున్న సమయంలో దాడి చేసిన భాస్క ర్‌తో పాటు మరికొందరు మరో దుర్మా ర్గానికి వడికట్టినట్లు బాధితురాలు తెలి పింది. ఈ ఘటన అనంతరం పలువురు ఉద్యోగులు, ఉషారాణికి నైతిక మద్దతు తెలుపుతున్నారన్న సమాచారాన్ని తెలుసు కున్న భాస్కర్‌తో పాటు మరికొందరు శాశ్విత, తాత్కాలిక ఉద్యోగులు కొత్త పథకం రచించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉషారాణి ఆసు పత్రిలో చికిత్స పొందుతుండగా అదే సమయంలో దాడి ఘటన నుంచి తప్పించుకునేందుకు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉషారాణికి వ్యతిరేకంగా ఒక లెటర్‌ ‌సిద్ధం చేయించారట. ఆమె కార్యాలయంలో అందరిని ఇబ్బంది కలిగిస్తుందని, ప్రవర్తన సరిగా లేదని, రెండు పేజీలతో కూడిన ఒక నివేదికను తయారుచేసి అందులో 14 మంది ద్వారా సంత కాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపారట. డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సమయంలోనే హోటల్‌ ‌లోని ఒక వర్గం ఆమెకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సృష్టించా రట. ఒకవైపు అంగవైకల్యం, ఇంకోవైపు దాడిలో గాయపడ్డ ఉషారాణిని కోలుకుని హోటల్‌కు రాకముందే ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఉషారాణి పై దాడి చేసిన సమయంలో సీసీ పుటేజీ బయటకు రాకపోయినట్లయితే ఈపాటికే ఆమె ఉద్యోగాన్ని ఊడగొట్టడమా, లేదా మరో చోటికి బదిలీ చేయడమా జరిగిపోయేదని బాధితురాలు వాపోయింది. అదృష్టవశావత్తు దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో ప్రస్పుటంగా కనిపిస్తుందడడం, అవి మీడియాలో ప్రచారం కావడం, అంతకుముందుగానే బాధితురాలు దర్గామిట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఉషారాణి ఒకవైపు దాడి, మరోవైపు ఉద్యోగ ప్రమాదం నుండి గట్టెక్కినట్లు ఆమె చెబుతోంది. ఉషారాణి పై దాడి జరిగిన రెండు రోజులుగా సీసీ పుటేజీ దృశ్యాలు వెలుగులోకి రాకపోవడంతో దాడిని కప్పిపుచ్చి కొందరు ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేసి ఆమెను హోటల్‌ ‌నుంచి వెళ్లగొట్టాలన్న మానవత్వం లేని దుర్మార్గానికి తెర లేపారట. పలువురు సంతకాలతో భాస్కర్‌, ‌బీవీఎంను ఉషారాణికి వ్యతిరేకంగా పంపిణ నివేదికను రాష్ట్ర స్థాయి అధికారులు నివేదికను పక్కను పెట్టడం వల్ల ఆమె ఉద్యోగ ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతోంది. మొత్తంగా ఘటనను గమనిస్తే అక్కడి అధికారుల దాష్టికం, దౌర్జన్యాలు ఉషారాణి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల పై డివిజన్‌ ‌స్థాయి అధికారులు పెట్టే వేధింపులు భరించలేక గతంలో ఓ యువతి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తాత్కాలిక, శాశ్విత ఉద్యోగుల మధ్య టూరిజం హోటల్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తామంటూ అక్కడి అధికారులు అవుట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల పై భౌతిక, మానసిక దాడులు వత్తిడికి గురిచేస్తున్నట్లు ఉషారాణి ఘటనతో తేటతెల్లమయింది. ఇంకోవైపు అయినదానికి, కానిదానికి అడ్డగోలుగా లెక్కలు చూపి లక్షల్లో టూరిజం సొమ్మును అక్కడి అధికారులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన తాత్కాలిక ఉద్యోగులను తీవ్రమైన బెదిరింపులు, మానసిక వత్తిళ్లకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఇటీవల పోలీసులకు తమ ఆవేదన వెలబుచ్చింది. ఉషారాణి పై దాడినేపథ్యంలో టూరిజం హోటల్‌లో జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాలు, వేధింపులే గాక నిధుల స్వాహా పర్వాల పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనతో ఇటు శాఖాపరమైన పాలనా అంశాల పైనే గాక, నిధుల వ్యయం పైనా దృష్టి సారిస్తే మరిన్ని కఠోర వాస్తవులు వెలుగుచూస్తాయన్న చర్చ అక్కడ జరుగుతుంది.

‌టూరిజం హోటల్‌ ‌దాడి ఘటనలో వెలుగుచూస్తున్న కొత్త దాష్టీకాలు
నిధుల వ్యయం పైన ఆరోపణలు
నెల్లూరు, జూలై 01, 2020 (పున్నమి ప్రతినిధి) : రాష్ట్రంతో పాటు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచ లనం…. ప్రజల్లో ఆగ్రహావేశాలు కలి గించిన టూరిజం హోటల్‌లో అడ్మిన్‌ ‌డిప్యూటీమేనేజర్‌ ‌భాస్కర్‌ అక్కడి తాత్కా లిక ఉద్యోగిని ఉషారాణి పై దాడి ఘట నలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సభ్య సమాజం తలదిం చుకునేలా మానవత్వానికి మాయని మచ్చలా వ్యవహరించిన డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడి అనంతరం మరో దారుణానికి సిద్ధమైనట్లు సమాచారం తెలిసింది. గత నెల 27న మధ్యాహ్నం కార్యాలయంలో ఉషారాణి పై విచక్షణా రహితంగా దాడిచేసిన భాస్కర్‌ను రక్షించేందుకు అక్కడి డివిజన్‌ ‌స్థాయి అధికారులతో పాటు కొందరు సిబ్బంది పథకం రచించినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉషారాణి ఆసుపత్రిలో చికిత్స పొందు చున్న సమయంలో దాడి చేసిన భాస్క ర్‌తో పాటు మరికొందరు మరో దుర్మా ర్గానికి వడికట్టినట్లు బాధితురాలు తెలి పింది. ఈ ఘటన అనంతరం పలువురు ఉద్యోగులు, ఉషారాణికి నైతిక మద్దతు తెలుపుతున్నారన్న సమాచారాన్ని తెలుసు కున్న భాస్కర్‌తో పాటు మరికొందరు శాశ్విత, తాత్కాలిక ఉద్యోగులు కొత్త పథకం రచించినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉషారాణి ఆసు పత్రిలో చికిత్స పొందుతుండగా అదే సమయంలో దాడి ఘటన నుంచి తప్పించుకునేందుకు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉషారాణికి వ్యతిరేకంగా ఒక లెటర్‌ ‌సిద్ధం చేయించారట. ఆమె కార్యాలయంలో అందరిని ఇబ్బంది కలిగిస్తుందని, ప్రవర్తన సరిగా లేదని, రెండు పేజీలతో కూడిన ఒక నివేదికను తయారుచేసి అందులో 14 మంది ద్వారా సంత కాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపారట. డిప్యూటీ మేనేజర్‌ ‌భాస్కర్‌ ‌దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సమయంలోనే హోటల్‌ ‌లోని ఒక వర్గం ఆమెకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సృష్టించా రట. ఒకవైపు అంగవైకల్యం, ఇంకోవైపు దాడిలో గాయపడ్డ ఉషారాణిని కోలుకుని హోటల్‌కు రాకముందే ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాలన్న దుర్మార్గపు ఆలోచనలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఉషారాణి పై దాడి చేసిన సమయంలో సీసీ పుటేజీ బయటకు రాకపోయినట్లయితే ఈపాటికే ఆమె ఉద్యోగాన్ని ఊడగొట్టడమా, లేదా మరో చోటికి బదిలీ చేయడమా జరిగిపోయేదని బాధితురాలు వాపోయింది. అదృష్టవశావత్తు దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో ప్రస్పుటంగా కనిపిస్తుందడడం, అవి మీడియాలో ప్రచారం కావడం, అంతకుముందుగానే బాధితురాలు దర్గామిట్ట పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఉషారాణి ఒకవైపు దాడి, మరోవైపు ఉద్యోగ ప్రమాదం నుండి గట్టెక్కినట్లు ఆమె చెబుతోంది. ఉషారాణి పై దాడి జరిగిన రెండు రోజులుగా సీసీ పుటేజీ దృశ్యాలు వెలుగులోకి రాకపోవడంతో దాడిని కప్పిపుచ్చి కొందరు ఉద్యోగులను భయభాంత్రులకు గురిచేసి ఆమెను హోటల్‌ ‌నుంచి వెళ్లగొట్టాలన్న మానవత్వం లేని దుర్మార్గానికి తెర లేపారట. పలువురు సంతకాలతో భాస్కర్‌, ‌బీవీఎంను ఉషారాణికి వ్యతిరేకంగా పంపిణ నివేదికను రాష్ట్ర స్థాయి అధికారులు నివేదికను పక్కను పెట్టడం వల్ల ఆమె ఉద్యోగ ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతోంది. మొత్తంగా ఘటనను గమనిస్తే అక్కడి అధికారుల దాష్టికం, దౌర్జన్యాలు ఉషారాణి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.
తాత్కాలిక ఉద్యోగుల పై డివిజన్‌ ‌స్థాయి అధికారులు పెట్టే వేధింపులు భరించలేక గతంలో ఓ యువతి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తాత్కాలిక, శాశ్విత ఉద్యోగుల మధ్య టూరిజం హోటల్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తామంటూ అక్కడి అధికారులు అవుట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల పై భౌతిక, మానసిక దాడులు వత్తిడికి గురిచేస్తున్నట్లు ఉషారాణి ఘటనతో తేటతెల్లమయింది. ఇంకోవైపు అయినదానికి, కానిదానికి అడ్డగోలుగా లెక్కలు చూపి లక్షల్లో టూరిజం సొమ్మును అక్కడి అధికారులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నించిన తాత్కాలిక ఉద్యోగులను తీవ్రమైన బెదిరింపులు, మానసిక వత్తిళ్లకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఇటీవల పోలీసులకు తమ ఆవేదన వెలబుచ్చింది. ఉషారాణి పై దాడినేపథ్యంలో టూరిజం హోటల్‌లో జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టీకాలు, వేధింపులే గాక నిధుల స్వాహా పర్వాల పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనతో ఇటు శాఖాపరమైన పాలనా అంశాల పైనే గాక, నిధుల వ్యయం పైనా దృష్టి సారిస్తే మరిన్ని కఠోర వాస్తవులు వెలుగుచూస్తాయన్న చర్చ అక్కడ జరుగుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.