Monday, 10 August 2026
  • Home  
  • *శ్రీ శక్తి పీఠంలో వైభవంగా ధర్మరక్షణ యజ్ఞం*
- తిరుపతి

*శ్రీ శక్తి పీఠంలో వైభవంగా ధర్మరక్షణ యజ్ఞం*

రామచంద్రాపురం ఆగస్టు 09 పున్నమి ప్రతినిధి పీఠాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాజంపేట ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దంపతులు రాయలచెరువులోని శ్రీ శక్తి పీఠ మహాక్షేత్రంలో నిత్యం కొనసాగుతున్న ధర్మరక్షణ యజ్ఞంలో రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దంపతులు విశేషంగా పాల్గొన్నారు. పీఠం ఆవరణలో నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో స్వయంగా ఆహుతులు సమర్పించి, పీఠాధిదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిని, మరియు శ్రీ శక్తి పీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి, “శక్తి గురు” శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. పీఠం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం గావించి, తీర్థప్రసాదాలను అందజేశారు. రాయలచెరువులో ఆగస్టు 8వ తేదీ నుండి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొనసాగుతున్న ఈ ధర్మరక్షణ యజ్ఞంలో వేలాదిమంది భక్తులు నిత్యం పాల్గొంటూ, స్వయంగా ఆహుతులు సమర్పిస్తూ, ధర్మసంరక్షణ మహాసంకల్పంలో భాగస్వాములై లోక కళ్యాణం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు — “ధర్మో రక్షతి రక్షితః” అన్న వేదవాక్యాన్ని ఆచరణలో నిజం చేస్తూ, తమ సంకల్పశక్తిని సమిష్టి ధర్మరక్షణగా మలుచుకుంటున్నారు.

రామచంద్రాపురం ఆగస్టు 09 పున్నమి ప్రతినిధి

పీఠాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాజంపేట ఎమ్మెల్యే శ్రీ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దంపతులు
రాయలచెరువులోని శ్రీ శక్తి పీఠ మహాక్షేత్రంలో నిత్యం కొనసాగుతున్న ధర్మరక్షణ యజ్ఞంలో రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి దంపతులు విశేషంగా పాల్గొన్నారు. పీఠం ఆవరణలో నిర్వహించిన ఈ మహాయజ్ఞంలో స్వయంగా ఆహుతులు సమర్పించి, పీఠాధిదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మ్రొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారిని, మరియు శ్రీ శక్తి పీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి, “శక్తి గురు” శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని, వారి దివ్య ఆశీస్సులు అందుకున్నారు. పీఠం అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం గావించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

రాయలచెరువులో ఆగస్టు 8వ తేదీ నుండి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కొనసాగుతున్న ఈ ధర్మరక్షణ యజ్ఞంలో వేలాదిమంది భక్తులు నిత్యం పాల్గొంటూ, స్వయంగా ఆహుతులు సమర్పిస్తూ, ధర్మసంరక్షణ మహాసంకల్పంలో భాగస్వాములై లోక కళ్యాణం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు — “ధర్మో రక్షతి రక్షితః” అన్న వేదవాక్యాన్ని ఆచరణలో నిజం చేస్తూ, తమ సంకల్పశక్తిని సమిష్టి ధర్మరక్షణగా మలుచుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.