కుబీర్:మండలంలోని పార్డి (బి) గ్రామంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్రను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గణేష్ విగ్రహాలను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాల్లో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి జైకొడుతూ సందడి చేశారు.తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ లడ్డూను వేలం వేయగా, గ్రామానికి చెందిన ఇర్ల రాజేశ్వర్ రూ.48 వేల కు దక్కించుకున్నారు.శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు చిమ్మన్ పోశెట్టి, తూము శంకర్, రాజేశ్వర్, సురేష్ బాబు, మోహన్, రాజన్న, రమేష్, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పార్డి (బి)లో ఘనంగా కర్ర గణనాథుడి శోభాయాత్ర. రూ.48 వేలకు లడ్డూ వేలంపాట దక్కించుకున్న ఇర్ల రాజేశ్వర్