Sunday, 23 August 2026
  • Home  
  • శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
- తిరుపతి

శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రెడ్డెమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం ఉత్సవమూర్తిని పరిమళభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహిళా భక్తులు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మీ వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు, సర్వమంగళం కలుగుతాయని తెలిపారు. కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, సర్వాభీష్టాలు సిద్ధించేందుకు వరలక్ష్మీదేవిని పూజించాలని సూచించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి అమ్మవారిని భక్తితో పూజించారు. వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమం భక్తుల ఆధ్యాత్మిక సందడితో కొనసాగింది. ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రెడ్డెమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం ఉత్సవమూర్తిని పరిమళభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహిళా భక్తులు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వరలక్ష్మీ వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల సకల శుభాలు, అఖండ సౌభాగ్యాలు, సర్వమంగళం కలుగుతాయని తెలిపారు. కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, సర్వాభీష్టాలు సిద్ధించేందుకు వరలక్ష్మీదేవిని పూజించాలని సూచించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి అమ్మవారిని భక్తితో పూజించారు. వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమం భక్తుల ఆధ్యాత్మిక సందడితో కొనసాగింది. ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.