పున్నమి ప్రతినిధి. తిరుపతి, 2026, ఏప్రిల్ 28.
భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతికి అర్చకులు సంప్రదాయబద్ధంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
——————————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.




