Wednesday, 12 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తి టౌన్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి యత్నించిన ఇద్దరు యువకుల అరెస్ట్
- తిరుపతి

శ్రీకాళహస్తి టౌన్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి యత్నించిన ఇద్దరు యువకుల అరెస్ట్

పున్నమి న్యూస్ కృష్ణ ఆగస్టు 12 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, కత్తితో పొడిచేందుకు యత్నించిన ఘటన. ప్రధాన నిందితుడు అచ్చి శ్రీనివాసులు అరెస్ట్; నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనంమరో నిందితుడు సముద్రాల జితేంద్ర కుమార్ కూడా అరెస్ట,తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతోదర్యాప్తు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టౌన్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, కత్తితో పొడిచేందుకు యత్నించిన ఇద్దరు యువకులను శ్రీకాళహస్తి I టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.11.08.2026వ తేదీ సాయంత్రం సుమారు 04:45 గంటల సమయంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి 112కు కాల్ రావడంతో, ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్ రైల్వే స్టేషన్‌లో దొంగతనానికి గురైనట్లుసమాచారం ఇచ్చాడు. సదరు కాలర్‌నుకలిసేందుకు శ్రీకాళహస్తి I టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ HC-789 U. రమణయ్య మోటార్ బైక్‌పై రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా, రైల్వే స్టేషన్‌కు ఎదురుగా తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై హ్యాపీ కిచెన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై, సంబంధిత వ్యక్తులు గొడవ పడుతున్నట్లు గమనించారు.ఈ క్రమంలోప్రమాదంలో గాయపడిన దంపతుల్లో బుజ్జమ్మ W/o మునిచంద్ర అనే మహిళను ఆమె భర్త సహాయంతో ఆటోలో ఎక్కించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికిపంపించారు. అనంతరం ప్రమాదానికి గురైన స్కూటీ (పెప్) బండి నంబర్ AP 03 CG 7137 రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్‌కుఅంతరాయం కలుగుతున్న నేపథ్యంలో దానిని పక్కకు పెట్టించి, దాని తాళాలను హెడ్ కానిస్టేబుల్ తీసుకున్నారు. అలాగే సదరు బండి డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కురావాల్సిందిగా సూచించారు. అంతలో సదరు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కోపంతో హెడ్ కానిస్టేబుల్ వద్దకు వచ్చి దురుసుగా మాట్లాడటంతో పాటు, ఆయన యూనిఫాం చొక్కాను పట్టుకొని లాగి దౌర్జన్యంగా వ్యవహరిస్తూ దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో A. శ్రీనివాసులు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌ను బెదిరిస్తూ, తన నడుము వద్ద ఉన్న కత్తి పౌచ్ నుంచి పిడి బాకును బయటకు తీసి ఆయనపై దాడి చేసి పొడిచేందుకు యత్నించాడు. అయితే హెడ్ కానిస్టేబుల్ తృటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై HC-789 U. రమణయ్య ఇచ్చిన స్పెషల్ రిపోర్ట్ ఆధారంగా శ్రీకాళహస్తి I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.112/2026 U/Sec. 132, 109(1), 351(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీఎల్.సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, శ్రీకాళహస్తి డీస్పీ శ్రీ కె . నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి I టౌన్ ఇన్‌స్పెక్టర్ C. వెంకటేష్, శ్రీకాళహస్తి I టౌన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎం . రామకృష్ణ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా మొదటి నిందితుడు A. శ్రీనివాసులను 11.08.2026వ తేదీ రాత్రి 08:00 గంటలకు అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కత్తిని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండవ నిందితుడు S. జితేంద్ర కుమార్‌ను 12.08.2026వ తేదీన అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలు అచ్చి శ్రీనివాసులు, వయస్సు 22 సంవత్సరాలు, తండ్రి పేరు ఏ .రమణయ్య, ఇంటి నం. 8-341, కొత్తపేట, శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లా. ప్రస్తుతం కొండమిట్ట,శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లాలో నివాసం. ఇతనిపై శ్రీకాళహస్తి II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక పాత కేసు ఉంది. సముద్రాల జితేంద్ర కుమార్, వయస్సు 20 సంవత్సరాలు, తండ్రి పేరు ముని కుమార్, ఇంటి నం. 6-349, గాంధీ స్ట్రీట్, కైకాల స్ట్రీట్, శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లా. వృత్తి: B.Tech మూడవ సంవత్సరం విద్యార్థి.పోలీస్ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం, విధులకు ఆటంకంకలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు

పున్నమి న్యూస్ కృష్ణ ఆగస్టు 12 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి.
పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, కత్తితో పొడిచేందుకు యత్నించిన ఘటన.
ప్రధాన నిందితుడు అచ్చి శ్రీనివాసులు అరెస్ట్; నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనంమరో నిందితుడు సముద్రాల జితేంద్ర కుమార్ కూడా అరెస్ట,తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతోదర్యాప్తు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టౌన్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, కత్తితో పొడిచేందుకు యత్నించిన ఇద్దరు యువకులను శ్రీకాళహస్తి I టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.11.08.2026వ తేదీ సాయంత్రం సుమారు 04:45 గంటల సమయంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి 112కు కాల్ రావడంతో, ఒక వ్యక్తి తన ల్యాప్‌టాప్ రైల్వే స్టేషన్‌లో దొంగతనానికి గురైనట్లుసమాచారం ఇచ్చాడు. సదరు కాలర్‌నుకలిసేందుకు శ్రీకాళహస్తి I టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ HC-789 U. రమణయ్య మోటార్ బైక్‌పై రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా, రైల్వే స్టేషన్‌కు ఎదురుగా తిరుపతి–శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై హ్యాపీ కిచెన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై, సంబంధిత వ్యక్తులు గొడవ పడుతున్నట్లు గమనించారు.ఈ క్రమంలోప్రమాదంలో గాయపడిన దంపతుల్లో బుజ్జమ్మ W/o మునిచంద్ర అనే మహిళను ఆమె భర్త సహాయంతో ఆటోలో ఎక్కించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికిపంపించారు. అనంతరం ప్రమాదానికి గురైన స్కూటీ (పెప్) బండి నంబర్ AP 03 CG 7137 రోడ్డుకు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్‌కుఅంతరాయం కలుగుతున్న నేపథ్యంలో దానిని పక్కకు పెట్టించి, దాని తాళాలను హెడ్ కానిస్టేబుల్ తీసుకున్నారు. అలాగే సదరు బండి డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కురావాల్సిందిగా సూచించారు.
అంతలో సదరు ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కోపంతో హెడ్ కానిస్టేబుల్ వద్దకు వచ్చి దురుసుగా మాట్లాడటంతో పాటు, ఆయన యూనిఫాం చొక్కాను పట్టుకొని లాగి దౌర్జన్యంగా వ్యవహరిస్తూ దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో A. శ్రీనివాసులు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌ను బెదిరిస్తూ, తన నడుము వద్ద ఉన్న కత్తి పౌచ్ నుంచి పిడి బాకును బయటకు తీసి ఆయనపై దాడి చేసి పొడిచేందుకు యత్నించాడు. అయితే హెడ్ కానిస్టేబుల్ తృటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై HC-789 U. రమణయ్య ఇచ్చిన స్పెషల్ రిపోర్ట్ ఆధారంగా శ్రీకాళహస్తి I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.112/2026 U/Sec. 132, 109(1), 351(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీఎల్.సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, శ్రీకాళహస్తి డీస్పీ శ్రీ కె . నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి I టౌన్ ఇన్‌స్పెక్టర్ C. వెంకటేష్, శ్రీకాళహస్తి I టౌన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎం . రామకృష్ణ మరియు సిబ్బందితో ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
దర్యాప్తులో భాగంగా మొదటి నిందితుడు A. శ్రీనివాసులను 11.08.2026వ తేదీ రాత్రి 08:00 గంటలకు అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కత్తిని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండవ నిందితుడు S. జితేంద్ర కుమార్‌ను 12.08.2026వ తేదీన అరెస్ట్ చేశారు.
నిందితుల వివరాలు
అచ్చి శ్రీనివాసులు, వయస్సు 22 సంవత్సరాలు, తండ్రి పేరు ఏ .రమణయ్య, ఇంటి నం. 8-341, కొత్తపేట, శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లా. ప్రస్తుతం కొండమిట్ట,శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లాలో నివాసం. ఇతనిపై శ్రీకాళహస్తి II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక పాత కేసు ఉంది.
సముద్రాల జితేంద్ర కుమార్, వయస్సు 20 సంవత్సరాలు, తండ్రి పేరు ముని కుమార్, ఇంటి నం. 6-349, గాంధీ స్ట్రీట్, కైకాల స్ట్రీట్, శ్రీకాళహస్తి టౌన్, తిరుపతి జిల్లా. వృత్తి: B.Tech మూడవ సంవత్సరం విద్యార్థి.పోలీస్ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడం, విధులకు ఆటంకంకలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించి, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.