Wednesday, 26 August 2026
  • Home  
  • శాంతారామ్ జె పవార్ సేవలు చిరస్మరణీయం-కాటంరెడ్డి పవిత్ర రెడ్డి
- తిరుపతి

శాంతారామ్ జె పవార్ సేవలు చిరస్మరణీయం-కాటంరెడ్డి పవిత్ర రెడ్డి

శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మాజీ పురపాలక సంఘ చైర్మన్ స్వర్గీయ శాంతారామ్ జె పవార్ సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి కొనియాడారు. శాంతారామ్ జె పవార్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, ఆయన నివాస ప్రాంగణంలో ఉన్న విగ్రహానికి పవిత్ర రెడ్డి విచ్చేశారు. పవార్ కుటుంబ సభ్యులు జనార్దన్ రావు జె పవార్, కుమార్తె డాక్టర్ అర్చనలతో కలిసి ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ.. శాంతారామ్ జె పవార్ శ్రీకాళహస్తి దేవస్థాన పాలకమండలి చైర్మన్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పట్టణాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ఈ నివాళుల కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, రత్నం రెడ్డి, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, కోవి చంద్రయ్య నాయుడు, మాజీ దేవస్థానం బోర్డు మెంబర్ మున్నా రాయల్ పాల్గొన్నారు. వీరితో పాటు యువజన విభాగ అధ్యక్షులు సూర సురేష్, ఉత్తరాజి శరవణ కుమార్, పెరుమాళ్ చౌదరి, ఫజల్, జుంలేష, మెహబూబ్ బాషా, జీలాని, బావాజీ, అస్లాం, గౌస్ బాషా, గిరి రెడ్డి, బుగ్గ హరి, కాపులూరి వెంకీ, శ్రీరాములు రెడ్డి, రవి నలుగురి, షరీఫ్, ఖాదర్ బాషా, విజయ్ కుమార్ రెడ్డి, ఆరీఫ్, బాబు, ఉస్మాన్, మస్తాన్, రియాజ్, సాదిక్, గిరి, యాకుబ్, దివ్య కాంత్ తదితర ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవార్‌కు నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.