Wednesday, 22 July 2026
  • Home  
  • శస్త్రచికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
- తిరుపతి

శస్త్రచికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కే.వి.బి.పురం, జూలై 22: కే.వి.బి.పురం మండలం ఆరే గ్రామపంచాయతీ పరిధిలోని జ్ఞానమ్మ కండ్రిగకు చెందిన ఓలూరు హరిబాబుకు తలకు శస్త్రచికిత్స కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుంచి రూ. 3,70,958 విలువైన చెక్కును ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ఎం.పీ. రాష్ట్ర మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు మరియు TUTUC తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, బి.ఎన్. కండ్రిగ మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం, డీవీసీ సభ్యుడు తలారి అయ్యప్ప, కే.వి.బి.పురం మండల నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

కే.వి.బి.పురం, జూలై 22: కే.వి.బి.పురం మండలం ఆరే గ్రామపంచాయతీ పరిధిలోని జ్ఞానమ్మ కండ్రిగకు చెందిన ఓలూరు హరిబాబుకు తలకు శస్త్రచికిత్స కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) నుంచి రూ. 3,70,958 విలువైన చెక్కును ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు సత్యవేడు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్, ఎం.పీ. రాష్ట్ర మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు మరియు TUTUC తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జయరామ్ రెడ్డి, బి.ఎన్. కండ్రిగ మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం, డీవీసీ సభ్యుడు తలారి అయ్యప్ప, కే.వి.బి.పురం మండల నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.