– మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, తాళిబొట్టు ఊరేగింపు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం, దేవమాచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొగ్గలపాడు, రామాపురం హరిజనవాడలో ఉప సర్పంచ్ ఎల్వీ మోహన్ రెడ్డి నూతనంగా ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలు, తాళిబొట్టును మంగళ వాయిద్యాల నడుమ భక్తులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ఠ, కల్యాణ మహోత్సవం నిర్వహించడంలో ఎల్వీ మోహన్ రెడ్డి చొరవ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దొగ్గలపాడు, రామాపురం, దేవమాచుపల్లి గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.


