Saturday, 29 August 2026
  • Home  
  • రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి : ఆచంటి కోటేశ్వర రావు
- ఖమ్మం

రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి : ఆచంటి కోటేశ్వర రావు

ఖమ్మం : శనివారం బిజెపి ఖమ్మం జిల్లా మాజీ ఏద్యుకేషన్ సెల్ కన్వీనర్ ఖమ్మం అర్బన్ టౌన్ కమిటీ ప్రధానకార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ తో మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అంశంపై 100 శాతం డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆచంట కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం :
శనివారం బిజెపి ఖమ్మం జిల్లా మాజీ ఏద్యుకేషన్ సెల్ కన్వీనర్ ఖమ్మం అర్బన్ టౌన్ కమిటీ ప్రధానకార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పువ్వాడ నాగేంద్ర కుమార్ తో మాట్లాడుతూ
ఆరు సంవత్సరాలుగా సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ అంశంపై 100 శాతం డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆచంట కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.