వార్త ముఖ్యాంశాలు
- వై.లోవ సర్పంచ్ పదవికి గ్రామస్థులు ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే, గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రూ.6.50000/ లక్షలు విరాళంగా అందిస్తానని వై.లోవ గ్రామానికి చెందిన బద్ది ఆనంద్ ప్రకటించారు.
- ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాలు, గ్రామ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పారదర్శకంగా వినియోగిస్తానని తెలిపారు.
- ఫోటోగ్రఫీ రంగంలో వ్యాపారవేత్తగా, వైసీపీ పార్టీ కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన బద్ది ఆనంద్ , స్వగ్రామం వై.లోవ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
వై.లోవ సర్పంచ్ పదవికి గ్రామస్థులు ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే, గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధుల నుంచి రూ.6.50000/ లక్షలు విరాళంగా అందిస్తానని వై.లోవ గ్రామానికి చెందిన బద్ది ఆనంద్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాలు, గ్రామ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పారదర్శకంగా వినియోగిస్తానని తెలిపారు.
ఫోటోగ్రఫీ రంగంలో వ్యాపారవేత్తగా, వైసీపీ పార్టీ కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన బద్ది ఆనంద్ , స్వగ్రామం వై.లోవ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో రాంబిల్లి మండల వైసీపీ పార్టీ కమిటీ సభ్యుడిగా, ప్రస్తుతం ఎలమంచిలి నియోజకవర్గ వైసీపీ పార్టీ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.విద్యార్థులకు సహకారం ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిన ఇద్దరు విద్యార్థుల కళాశాల ఫీజులను తన సొంత ఖర్చులతో చెల్లిస్తున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.గ్రామ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు అండగా నిలవడం, ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేర్చడమే తన లక్ష్యమని ఆనంద్ అన్నారు.
అందరి సహకారం కోరిక రాజకీయ పార్టీల భేదాలను పక్కన పెట్టి, గ్రామాభివృద్ధి కోసం పెద్దలు, యువత, మహిళలు, నాయకులు కలిసి ముందుకు రావాలని ఆనంద్ కోరారు. “పదవి కోసం కాదు, గ్రామ ప్రగతి కోసం” సేవ చేయాలని పేర్కొన్నారు.
వై.లోవను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్చడమే తన సంకల్పమని, గ్రామస్థుల ఆశీస్సులు, సలహాలు, సహకారంతో ముందుకు సాగుతానని బద్ది ఆనంద్ తెలిపారు.
వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్సైట్