Wednesday, 9 September 2026
  • Home  
  • వెలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్‌కు శంకుస్థాపన – 177 కుటుంబాలకు శాశ్వత పరిష్కారం
- విశాఖపట్నం

వెలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్‌కు శంకుస్థాపన – 177 కుటుంబాలకు శాశ్వత పరిష్కారం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వెలంపేట – లక్ష్మీనగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివాస సమస్యలు ఎదుర్కొంటున్న 177 పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్రంలోనే తొలి మోడల్ స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి . నారాయణ శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవతో ఈ ప్రాజెక్ట్ సాకారం అయింది. *ప్రాజెక్ట్ వివరాలు:* – *స్థలం:* 55 సెంట్లు – *లబ్ధిదారులు:* 177 కుటుంబాలు – *వ్యయం:* రూ. 28.44 కోట్లు – *నిర్మాణం:* 12 అంతస్తులు (45 మీటర్ల ఎత్తు), ఆధునిక షేర్-వాల్ టెక్నాలజీ – *ఒక్కో యూనిట్ విలువ:* రూ. 16.07 లక్షలు – *గడువు:* 9 నెలల్లో పూర్తి – *నిర్మాణ సంస్థ:* NCC ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన ఇల్లు ఇవ్వడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, వెలంపేట మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో మరో 4 స్లమ్స్ అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, పేదల సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గన్నారు

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వెలంపేట – లక్ష్మీనగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివాస సమస్యలు ఎదుర్కొంటున్న 177 పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్రంలోనే తొలి మోడల్ స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి . నారాయణ శంకుస్థాపన చేశారు.

జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవతో ఈ ప్రాజెక్ట్ సాకారం అయింది.

*ప్రాజెక్ట్ వివరాలు:*
– *స్థలం:* 55 సెంట్లు
– *లబ్ధిదారులు:* 177 కుటుంబాలు
– *వ్యయం:* రూ. 28.44 కోట్లు
– *నిర్మాణం:* 12 అంతస్తులు (45 మీటర్ల ఎత్తు), ఆధునిక షేర్-వాల్ టెక్నాలజీ
– *ఒక్కో యూనిట్ విలువ:* రూ. 16.07 లక్షలు
– *గడువు:* 9 నెలల్లో పూర్తి
– *నిర్మాణ సంస్థ:* NCC

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన ఇల్లు ఇవ్వడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, వెలంపేట మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో మరో 4 స్లమ్స్ అభివృద్ధికి హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, పేదల సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.