కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో గాంధీనగరం అంగన్వాడి కేంద్రంలో బుధవారం పోషణ మాసం 2026 ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తాళ్లరేవు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ వై శ్రీదేవి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పర్యవేక్షకులు ఇచ్చే నిభావాని మాట్లాడుతూ తల్లులకు పౌష్టికాహార ప్రాముఖ్యతను గురించి మరియు వైవిధ్యమైన ఆహారం గురించి వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 9 వ తారీకు వరకు పోషణ మాసోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, తల్లులు, ఇతర మహిళలు,అంగన్వాడి కార్యకర్తలు జి సూర్యకుమారి,కే శ్రీదేవి,ఎం గంగాభవాని,సునీత,భారతి,సత్యనారాయణమ్మ,సుబ్బలక్ష్మి,మంగాదేవి,వెంకటలక్ష్మి, వేణు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషణ మాసం 2026 కార్యక్రమాలు ప్రారంభం