విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వెలంపేట – లక్ష్మీనగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివాస సమస్యలు ఎదుర్కొంటున్న 177 పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్రంలోనే తొలి మోడల్ స్లమ్ రీ-డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి . నారాయణ శంకుస్థాపన చేశారు.
జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవతో ఈ ప్రాజెక్ట్ సాకారం అయింది.
*ప్రాజెక్ట్ వివరాలు:*
– *స్థలం:* 55 సెంట్లు
– *లబ్ధిదారులు:* 177 కుటుంబాలు
– *వ్యయం:* రూ. 28.44 కోట్లు
– *నిర్మాణం:* 12 అంతస్తులు (45 మీటర్ల ఎత్తు), ఆధునిక షేర్-వాల్ టెక్నాలజీ
– *ఒక్కో యూనిట్ విలువ:* రూ. 16.07 లక్షలు
– *గడువు:* 9 నెలల్లో పూర్తి
– *నిర్మాణ సంస్థ:* NCC
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన ఇల్లు ఇవ్వడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, వెలంపేట మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో మరో 4 స్లమ్స్ అభివృద్ధికి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, పేదల సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గన్నారు

