వీరుల త్యాగం స్ఫూర్తిగాప్రజాసేవే మన సంకల్పం గా సాగుదాంకిషోర్ గునుకులజనసేన
*ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*
నెల్లూరు సిటీ, 16వ డివిజన్:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు సిటీ 16వ డివిజన్‌లోని గుర్రాలమడుగు సంఘం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి స్ఫూర్తితో వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషోర్ గుణుకుల మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారు కలలు కన్న బలమైన, సమానత్వంతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
“స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు… అవినీతి, అన్యాయం, పేదరికం, అసమానతలపై పోరాడటమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి” అని అన్నారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ, నిజాయితీ, బాధ్యత, సామాజిక న్యాయం అనే విలువలకు ప్రాధాన్యతనిస్తూ రాజకీయాల్లో ఒక కొత్త మార్పుకు నాంది పలికారని కిషోర్ గుణుకుల పేర్కొన్నారు. “ప్రజలే ముందు – ప్రజా సంక్షేమమే లక్ష్యం” అనే జనసేన సిద్ధాంతంతో ప్రతి కార్యకర్త ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని అన్నారు.
యువత దేశ భవిష్యత్తుకు వెన్నెముక అని, దేశ నిర్మాణంలో యువత మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశభక్తిని కేవలం ఒకరోజు వేడుకగా కాకుండా ప్రతిరోజూ ప్రజాసేవ, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధి రూపంలో ఆచరణలో చూపించాలని అన్నారు.
ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మన నెల్లూరు నగర అభివృద్ధిలో కూడా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కిషోర్ గునుకుల కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగేంద్ర బాలూ, నరహరి, ప్రశాంత్ గౌడ్, లత, హరి,జనసైనికులు పాల్గొని “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “జై జనసేన” నినాదాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.



