కారేపల్లి/ ఖమ్మం
గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని కారేపల్లి క్రాస్ రోడ్‌లోని వినాయక విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాన్ని కారేపల్లి ఎస్సై గోపి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు అన్ని భద్రతా, రక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్సై గోపి నిర్వాహకులకు సూచించారు.



