కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామ పంచాయతీ రామన్నపాలెం గ్రామం వెళ్లే రహదారి అధ్వానంగా తయారై,వాహన చోదకులకు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. ప్రధాన రహదారి నుండి రామన్నపాలెం గ్రామం వెళ్లే రహదారి సుమారు కిలోమీటరు దూరం ఉంటుంది. కిలోమీటరు మేర రహదారి రాళ్లు పైకి లేచి,గుంతలు పడి వాహనాల రాకపోకలకు అసౌకర్యకరంగా మారింది. గోతులుగా మారిన ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుండడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. పాదచారులు సైతం ఈ రహదారిపై నడవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. రహదారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా,పట్టించుకునే వారు కరువయ్యారు. రామన్నపాలెం గ్రామానికి చెందిన ప్రజలు ఒకే రహదారి కావడంతో అనునిత్యం ఈ రహదారినే ఉపయోగిస్తుంటారు.ప్రతిరోజు ద్విచక్ర వాహనాలు,ఆటోలు,కార్లు తిరుగుతూ ఉంటాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అసౌకర్యాలకు గురవుతూనే రహదారిపై రాకపోకలు సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమ గ్రామ రహదారిని మెరుగుపరిచి సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా చూడాలని ప్రజల ముక్తకంఠంతో కోరుతున్నారు.
వాహన చోదకులకు అసౌకర్యకరంగా తయారైన రామన్నపాలెం గ్రామం వెళ్లే రహదారి