వరదయ్యపాలెం మండలంలో రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ఎల్నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఎల్నినో కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులు, వాటి వల్ల పంటలపై పడే ప్రభావాల గురించి రైతులకు వివరించారు.
అధికారులు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నందున రైతులు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించాలని సూచించారు. అలాగే నీటి వినియోగంలో పొదుపు పాటించడం, పంటల సంరక్షణ చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం రైతులకు 13 రకాల ధాన్యపు విత్తనాల సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం వ్యవసాయ అధికారి (ఏఓ) గౌరి, డీవీఎంసీ సభ్యుడు గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

