వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి కేసు నమోదైంది. 3 టౌన్ సీఐ మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం సారధి నగర్లో బానోత్ వరలక్ష్మి, బాబురావు దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. బాబురావు తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి వరకట్నం కోసం భార్య వరలక్ష్మిని వేధించేవాడని సీఐ తెలిపారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు మోహన్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



