Tuesday, 25 August 2026
  • Home  
  • రైతు భరోసా చివరి విడత నిధులు విడుదల.. ఖమ్మం సభలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఖమ్మం

రైతు భరోసా చివరి విడత నిధులు విడుదల.. ఖమ్మం సభలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జులై (పువ్వాడ నాగేంద్ర కుమార్ /పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ ) ఖమ్మం జిల్లా చింతకాని రైతు ఆశీర్వాద సభలో రూ.1009 కోట్ల విడుదల ఖమ్మం: వానాకాలం పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా చివరి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.1009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తం రూ.8759 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 మే-జూన్ మధ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని పేర్కొన్నారు. 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు సాధించి రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు వస్తావో.. నీ కొడుకు వస్తాడో.. నీ బిడ్డ వస్తుందో.. నీ అల్లుడు వస్తాడో రండి.. తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అంశంపై స్పందిస్తూ.. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం ప్రాంతానికి ప్రమాదం ఏర్పడుతుందని, 44 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. భద్రాద్రి రాముడి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. హరీష్ రావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అది అబద్ధమని నిరూపించాలంటే తన మామ కేసీఆర్‌పై, భద్రాచలం శ్రీరాముడిపై ప్రమాణం చేయాలని సీఎం అన్నారు. ఖమ్మం జిల్లా రైతు ఆశీర్వాద సభ వేదికగా “కురుక్షేత్రం ప్రారంభమైంది” అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు

ఖమ్మం జులై
(పువ్వాడ నాగేంద్ర కుమార్
/పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ )

ఖమ్మం జిల్లా చింతకాని రైతు ఆశీర్వాద సభలో రూ.1009 కోట్ల విడుదల

ఖమ్మం: వానాకాలం పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా చివరి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.1009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తం రూ.8759 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు సీఎం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 మే-జూన్ మధ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని పేర్కొన్నారు. 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు సాధించి రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు వస్తావో.. నీ కొడుకు వస్తాడో.. నీ బిడ్డ వస్తుందో.. నీ అల్లుడు వస్తాడో రండి.. తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అంశంపై స్పందిస్తూ.. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం ప్రాంతానికి ప్రమాదం ఏర్పడుతుందని, 44 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. భద్రాద్రి రాముడి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.

హరీష్ రావు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అది అబద్ధమని నిరూపించాలంటే తన మామ కేసీఆర్‌పై, భద్రాచలం శ్రీరాముడిపై ప్రమాణం చేయాలని సీఎం అన్నారు.

ఖమ్మం జిల్లా రైతు ఆశీర్వాద సభ వేదికగా “కురుక్షేత్రం ప్రారంభమైంది” అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.