Tuesday, 30 June 2026
  • Home  
  • రైతులకు శుభవార్త.. ఏటికొప్పాక ఇరిగేషన్ కాలువల పూడికతీతకు శ్రీకారం – సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..!
- అనకాపల్లి

రైతులకు శుభవార్త.. ఏటికొప్పాక ఇరిగేషన్ కాలువల పూడికతీతకు శ్రీకారం – సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..!

అనకాపల్లి జిల్లా, జూన్ 30 (పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో రైతులకు సాగునీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలనే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువల పూడికతీత, అడ్డుగా పెరిగిన చెట్ల తొలగింపు పనులను క్రేన్ మిషన్ సహాయంతో ఘనంగా ప్రారంభించారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు రావి చలపతి, కాలువ డైరెక్టర్లు కర్రీ సింహాచలం, గొంతు మూర్తి రాజారావు, కోరుమిల్లి ప్రభ, అన్నం రాంబాబు పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు, జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, కొండయ్య నాయుడు, అన్నం స్వరాజ్ రావు, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, దేవరపు మోహన్ రావు, బీజేపీ నాయకుడు శెన్నాంశెట్టి శ్రీను తదితరులు పనులను ప్రారంభించి, రైతులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. కాలువల పూడికతీత పూర్తయిన తర్వాత సాగునీటి సరఫరా మరింత మెరుగుపడి, వర్షాకాలంలో నీటి వృథా తగ్గడంతో పాటు రైతులకు సమయానికి నీరు అందుతుందని నాయకులు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన ఈ పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు అధికారులను కోరారు.

అనకాపల్లి జిల్లా, జూన్ 30 (పున్నమి న్యూస్ – రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో రైతులకు సాగునీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలనే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువల పూడికతీత, అడ్డుగా పెరిగిన చెట్ల తొలగింపు పనులను క్రేన్ మిషన్ సహాయంతో ఘనంగా ప్రారంభించారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు దేవి ప్రసాద్, ఉపాధ్యక్షులు రావి చలపతి, కాలువ డైరెక్టర్లు కర్రీ సింహాచలం, గొంతు మూర్తి రాజారావు, కోరుమిల్లి ప్రభ, అన్నం రాంబాబు పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు, జనసేన మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, కొండయ్య నాయుడు, అన్నం స్వరాజ్ రావు, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, దేవరపు మోహన్ రావు, బీజేపీ నాయకుడు శెన్నాంశెట్టి శ్రీను తదితరులు పనులను ప్రారంభించి, రైతులకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

కాలువల పూడికతీత పూర్తయిన తర్వాత సాగునీటి సరఫరా మరింత మెరుగుపడి, వర్షాకాలంలో నీటి వృథా తగ్గడంతో పాటు రైతులకు సమయానికి నీరు అందుతుందని నాయకులు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఇరిగేషన్ శాఖ చేపట్టిన ఈ పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు అధికారులను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.