డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం. 17 ఆగస్టు 2026 (పున్నమి ప్రతినిధి): పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచే నాయకుడికే తగిన ఫలితం ఇవ్వాలని పి.గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు పున్నమి న్యూస్‌తో మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడికే ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, జగన్ బటన్ నొక్కడం మాత్రమే చేస్తారని విమర్శించేవారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సంక్షేమ పథకాలకు బటన్ నొక్కేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. బటన్ నొక్కడం రాని వారికి, పథకాలు అమలు చేయడం చేతకాని వారికి పదవులు ఎందుకని గన్నవరపు శ్రీనివాసరావు నిలదీశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికే ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాలు అమలు చేసేవారికే ప్రజల తీర్పు! గన్నవరపు శ్రీనివాసరావు