
నెల్లూరు పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️
రైతులకు కరోనా కష్టాలు తీర్చేందుకు నాబార్డ్ సహకారంతో రైతాంగానికి రూ.100 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు సహకార బ్యాంక్ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.సంవత్సరం లోపు అయితే సున్నా వడ్డీ,ఆ పైన అయితే 25 పైసలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.రైతులందరూ జిల్లాలోని ఆయా బ్యాంక్ కేంద్రాల వద్ద రుణాలు కొరకు సంప్రదించాలన్నారు.బ్యాంక్ లావాదేవీలను మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా చేసుకోవచ్చని ఆయన వివరించారు.

