ప్రజలు తమ వివాదాలను సత్వరంగా, రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు రేపు (సెప్టెంబర్ 12) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ లోక్ అదాలత్లో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ చేయదగిన కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇరుపక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని న్యాయ సేవా సంస్థలు సూచిస్తున్నాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.



