Wednesday, 17 June 2026
  • Home  
  • రెండేళ్ల పాలనలో హామీలు గాలికొదిలారు: కాకాణి”
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండేళ్ల పాలనలో హామీలు గాలికొదిలారు: కాకాణి”

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 9 (పున్నమి ప్రకృతి) చంద్రబాబు ప్రస్థానం వెన్నుపోటుతోనే ప్రారంభమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం కంటే హామీల అమలులో విఫలమై ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అవినీతి జరిగిందని, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు కొనసాగిస్తుందని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 9 (పున్నమి ప్రకృతి)
చంద్రబాబు ప్రస్థానం వెన్నుపోటుతోనే ప్రారంభమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మనుబోలు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం కంటే హామీల అమలులో విఫలమై ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో అవినీతి జరిగిందని, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ నిరసనలు కొనసాగిస్తుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.