నర్సీపట్నం పరిధిలోని పల్నాడు నగర్‌లో గల ఎంఈఐఎల్ సోలార్ కార్యాలయం, అనకాపల్లి ప్రైవేటు లిమిటెడ్ స్టోర్ యార్డ్‌లో జరిగిన పీవీసీ ఇన్సులేటెడ్ వైర్ల కేబుల్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 3.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడైన లంకే మల్లేష్‌తో పాటు వెంపాల సంతోష్ కుమార్, గుంటూరు కృష్ణమూర్తి, చొప్పా పవన్, చేతిన నవీన్ అలియాస్ పండులను గురువారం రాత్రి గాజువాక సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు మహేష్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.


