Sunday, 27 September 2026
  • Home  
  • రామాపురం పల్లె పండుగకు కావలి నుంచి 13 వేల మంది.. భారీ ఏర్పాట్లు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామాపురం పల్లె పండుగకు కావలి నుంచి 13 వేల మంది.. భారీ ఏర్పాట్లు

ఈ నెల 29న వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగను విజయవంతం చేయాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కావలిలో నిర్వహించిన కూటమి సమావేశంలో పల్లె పండుగ ఏర్పాట్లు, జన సమీకరణపై కార్యాచరణ రూపొందించారు. కావలి నియోజకవర్గం నుంచి సుమారు 13 వేల మందిని కార్యక్రమానికి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని నాయకులకు సూచించారు. పల్లె పండుగలో కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.