Sunday, 27 September 2026
  • Home  
  • పెంచలకోనలో వైభవంగా ముగిసిన శ్రీవార్ల పవిత్రోత్సవాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెంచలకోనలో వైభవంగా ముగిసిన శ్రీవార్ల పవిత్రోత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీవార్ల పవిత్రోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. చతుస్థానార్చన, వేద, దివ్య ప్రబంధ పారాయణాలు, విశేష హోమం నిర్వహించారు. అనంతరం శేష వాహన సేవ క్షేత్రోత్సవం, శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి స్నపన తిరుమంజనం చేపట్టారు. ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణాహుతి, మహాకుంభప్రోక్షణ కార్యక్రమాలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య సంప్రదాయబద్ధంగా ముగిశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.