జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఏడో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అడవుల్లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు గాలింపు చర్యలకు సవాలుగా మారుతున్నాయి.


