Sunday, 19 July 2026
  • Home  
  • రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ _ ఆంధ్ర కార్యక్రమం
- తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ _ ఆంధ్ర కార్యక్రమం

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు మార్గదర్శకాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు ఆదేశానుసారం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె.వి. శివప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ స్వచ్ఛత యొక్క విశిష్టత, సమాజ ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రతి పౌరుడు స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ విభాగములో పనిచేస్తున్న ఆరోగ్య విద్యా బోధకులు ఆర్ శ్రీనివాస్ పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కార్యక్రమములో పాల్గొన్నవారిచే ప్రతిజ్ఞ చేయించారు. అనాటమీ విభాగాధిపతి డా. టి. శారద పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ డా. సూర్యారావు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిపాలన విభాగ సిబ్బంది, పారిశుధ్య విభాగపు సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్య అభివృద్ధికి అంకితభావంతో అందరూ కలిసి పనిచేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు మార్గదర్శకాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు ఆదేశానుసారం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె.వి. శివప్రసాద్ ప్రారంభోపన్యాసం చేస్తూ స్వచ్ఛత యొక్క విశిష్టత, సమాజ ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రతి పౌరుడు స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. వైద్య విద్యార్థులు పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ విభాగములో పనిచేస్తున్న ఆరోగ్య విద్యా బోధకులు ఆర్ శ్రీనివాస్ పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని కార్యక్రమములో పాల్గొన్నవారిచే ప్రతిజ్ఞ చేయించారు.
అనాటమీ విభాగాధిపతి డా. టి. శారద పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ డా. సూర్యారావు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పరిపాలన విభాగ సిబ్బంది, పారిశుధ్య విభాగపు సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజారోగ్య అభివృద్ధికి అంకితభావంతో అందరూ కలిసి పనిచేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.