Wednesday, 26 August 2026
  • Home  
  • రసాయన రహిత సాగుతోనే రైతు సంక్షేమం-జనసేన నాయకుడు దండి నరేంద్ర
- తిరుపతి

రసాయన రహిత సాగుతోనే రైతు సంక్షేమం-జనసేన నాయకుడు దండి నరేంద్ర

శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): ప్రకృతి వ్యవసాయంలోని ఉత్తమ పద్ధతులను ప్రతి రైతుకూ చేరువ చేసి భవిష్యత్ తరాలకు రసాయన అవశేషాలు లేని నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యమని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకుడు దండి నరేంద్ర అన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముగం ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మండల ప్రకృతి వ్యవసాయ ఇన్-చార్జ్ దార్సి ప్రసాద్ ఆధ్వర్యంలో, విఏఏ గౌతమి సహకారంతో అక్కుర్తి రైతు సేవా కేంద్రంలో బిఆర్‌సి పాయింట్ పర్సన్స్‌కు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మమతా రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షుడు కుమారి నాగరాజు, ఆర్ వైఎస్ఎస్ ప్రతినిధి భానుమూర్తి పాల్గొని ఎల్-నినో ప్రభావం, ప్రకృతి వ్యవసాయ ప్రాధాన్యతపై మార్గనిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా అంతర పంటల సాగు, విత్తన గుళికల తయారీ, ఘన, ద్రవ జీవామృతం మరియు కషాయాల తయారీపై బిఆర్‌సి ప్రతినిధులకు ప్రత్యక్ష ప్రదర్శనతో పాటు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దండి నరేంద్ర మాట్లాడుతూ.. నేల సారాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంటల సాగుకు ప్రకృతి వ్యవసాయమే బలమైన బాట అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు మాజీ సభ్యుడు, జనసేన సీనియర్ నాయకుడు దండి రాఘవయ్య పాల్గొని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు రైతులకు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.