Saturday, 19 September 2026
  • Home  
  • యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘పరివర్తన’ అవగాహన సదస్సు
- అనకాపల్లి

యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘పరివర్తన’ అవగాహన సదస్సు

యలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ : ​యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, అనకాపల్లికి చెందిన సీడ్ అర్గనైజేషన్ వ్యసన విముక్తి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘పరివర్తన’ అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ​ఈ సదస్సులో భాగంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేందుకు చేపట్టాల్సిన డి-అడిక్షన్ చర్యలు, వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై సవివరంగా అవగాహన కల్పించారు. ​మత్తు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ వి. చిట్టిబాబు, డాక్టర్ కె. సుజాతలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ :

​యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం, అనకాపల్లికి చెందిన సీడ్ అర్గనైజేషన్ వ్యసన విముక్తి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘పరివర్తన’ అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ​ఈ సదస్సులో భాగంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడేందుకు చేపట్టాల్సిన డి-అడిక్షన్ చర్యలు, వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలపై సవివరంగా అవగాహన కల్పించారు. ​మత్తు రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ వి. చిట్టిబాబు, డాక్టర్ కె. సుజాతలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.