Saturday, 5 September 2026
  • Home  
  • మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మిషన్ వాక్ పౌండర్ డాక్టర్ బాధవత్ రవి*
- ఖమ్మం

మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మిషన్ వాక్ పౌండర్ డాక్టర్ బాధవత్ రవి*

*మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మిషన్ వాక్ పౌండర్ డాక్టర్ బాధవత్ రవి* *తల్లి తండ్రుల కష్టాన్ని గుర్తించి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని విధార్థులను కోరిన డాక్టర్* ఏన్కూరు: లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని మిషన్ వాక్ ఫౌండర్ డాక్టర్ బాధావత్ రవి పేర్కొన్నారు. ఆదివారం మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి, ప్రేరణ కలిగించారు. ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలని, లక్ష్యం మీదనే ప్రధాన దృష్టి పెట్టాలని కోరారు. సీనియర్స్ తో స్నేహం చేస్తూ కెరియర్ గైడెన్స్ తెలుసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రానున్న కాలంలో ఫిజియోథెరపీ రంగానికి బాగా డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిజియోథెరపీని ఎంచుకోవాలని కోరారు.ప్రతిరోజు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. చదువు నేర్పిన గురువులను గౌరవించాలని తెలిపారు. అనంతరం పాఠశాలకు అవసరమైన సీలింగ్ ఫ్యాన్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ సేవలాల్ సేన ఖమ్మం జిల్లా కన్వీనర్ చందు నాయక్ తూత్క లింగన్నపేట సర్పంచ్ గుగులోత్ ప్రవీణ్, పాఠశాల డిప్యూటీ వార్డెన్ డీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

*మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మిషన్ వాక్ పౌండర్ డాక్టర్ బాధవత్ రవి*
*తల్లి తండ్రుల కష్టాన్ని గుర్తించి లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని విధార్థులను కోరిన డాక్టర్*

ఏన్కూరు:
లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని మిషన్ వాక్ ఫౌండర్ డాక్టర్ బాధావత్ రవి పేర్కొన్నారు. ఆదివారం మూలపోచారం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి, ప్రేరణ కలిగించారు. ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలని, లక్ష్యం మీదనే ప్రధాన దృష్టి పెట్టాలని కోరారు. సీనియర్స్ తో స్నేహం చేస్తూ కెరియర్ గైడెన్స్ తెలుసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రానున్న కాలంలో ఫిజియోథెరపీ రంగానికి బాగా డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిజియోథెరపీని ఎంచుకోవాలని కోరారు.ప్రతిరోజు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. చదువు నేర్పిన గురువులను గౌరవించాలని తెలిపారు. అనంతరం పాఠశాలకు అవసరమైన సీలింగ్ ఫ్యాన్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ నాయక్ సేవలాల్ సేన ఖమ్మం జిల్లా కన్వీనర్ చందు నాయక్
తూత్క లింగన్నపేట సర్పంచ్ గుగులోత్ ప్రవీణ్, పాఠశాల డిప్యూటీ వార్డెన్ డీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.