Saturday, 13 June 2026
  • Home  
  • మురళీనగర్ హత్య కేసు ఛేదించిన కంచరపాలెం పోలీసులు.. 12 మంది నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు .
- విశాఖపట్నం

మురళీనగర్ హత్య కేసు ఛేదించిన కంచరపాలెం పోలీసులు.. 12 మంది నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు .

గంటల వ్యవధిలోనే నిందితుల గుర్తింపు.. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించిన కంచరపాలెం పోలీసు లు.. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి పి. ప్రదీప్తి.కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసు బృందానికి సీపీ ప్రత్యేక అభినందనలు.గత రాత్రి మురళీనగర్ మసీదు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను కంచరపాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం తో బృందాలుగా ఏర్పడి గంటల వ్యవధిలో హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు కు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న కంచరపాలెం పోలీసులు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కంచరపాలెం పోలీసు స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి పి. ప్రదీప్తి వివరాలు వెల్లడించారు. ఆదివారం రాత్రి సుమారు 10గంటల సమయంలో మురళీనగర్ మసీదు సమీపంలో జోసఫ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటీవలే సీమెన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సాలిపేట ప్రాంతానికి చెందిన రుద్రాక్ష వరుణ్ రాజ్ అక్కడికి చేరుకున్నాడు. ఈక్రమంలో . అతని స్నేహితులు అక్కడ గుమికూడి ఉన్నారు. సుమారు 15 రోజుల క్రితం మాధవధార వైన్ షాప్ వద్ద జరిగిన గొడవలో పాత కక్షలు ఏర్పడ్డాయి. గతంలో జరిగిన తేజా హత్యకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రావడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ కక్షల నేపథ్యంలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిళ్లపై మురళీనగర్ మసీదు సమీపానికి చేరుకొని ప్రత్యర్థి వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో రుద్రాక్ష వరుణ్ రాజ్ నిందితుల చేతికి చిక్కి తీవ్రంగా గాయపడ్డంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ రుద్రాక్ష వరుణ్ రాజ్ మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతుని తల్లి రుద్రాక్ష రాజామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కంచరపాలెం పోలీసులు బృందాలుగా ఏర్పడి .ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్, బండి కార్తీక్, మువ్యల శివ శంకర్, కొన్న వైకుంఠరావు, కొప్పర రామకృష్ణ, సారిక ఫణీంద్ర, జొన్నాడ చంద్రశేఖర్, అల్లిపురం సాయికుమార్, అలమండ జగదీష్, బసవ సాయి రోహిత్ రావు, కంకణాల కిరణ్ కుమార్ అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కాగా నిందితుల్లో ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్ పై రౌడీ షీట్ ఉందని అలాగే బండి కార్తీక్, మువ్వల శివ శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారని జొన్నాడ చంద్ర శేఖర్, అల్లి పురం సాయి కుమార్, బసవ సాయి రోహిత్ రావు పై హత్య యత్నం కేసులో నిందితులుగా పేర్కొన్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కంచరపాలెం సీఐ కే. రవికుమార్, ఎస్ ఐ లు ఎం. రవికుమార్, కే. భాస్కర్ రవు, ఎస్. అజయ్ కుమార్, ఉమెన్ ఎస్ ఐ అరుణ, సి హెచ్ కార్తీక్ లను నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారని ఏసిపి ప్రదీప్టీ తెలిపారు.

గంటల వ్యవధిలోనే నిందితుల గుర్తింపు.. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించిన కంచరపాలెం పోలీసు లు..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి పి. ప్రదీప్తి.కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసు బృందానికి సీపీ ప్రత్యేక అభినందనలు.గత రాత్రి మురళీనగర్ మసీదు వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను కంచరపాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం తో బృందాలుగా ఏర్పడి గంటల వ్యవధిలో హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు కు సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న కంచరపాలెం పోలీసులు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కంచరపాలెం పోలీసు స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ ఏసిపి పి. ప్రదీప్తి వివరాలు వెల్లడించారు.
ఆదివారం రాత్రి సుమారు 10గంటల సమయంలో మురళీనగర్ మసీదు సమీపంలో జోసఫ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా
ఇటీవలే సీమెన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న
సాలిపేట ప్రాంతానికి చెందిన రుద్రాక్ష వరుణ్ రాజ్ అక్కడికి చేరుకున్నాడు. ఈక్రమంలో .
అతని స్నేహితులు అక్కడ గుమికూడి ఉన్నారు. సుమారు 15 రోజుల క్రితం మాధవధార వైన్ షాప్ వద్ద జరిగిన గొడవలో పాత కక్షలు ఏర్పడ్డాయి. గతంలో జరిగిన తేజా హత్యకు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రావడంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ కక్షల నేపథ్యంలో ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిళ్లపై మురళీనగర్ మసీదు సమీపానికి చేరుకొని ప్రత్యర్థి వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
ఈ క్రమంలో రుద్రాక్ష వరుణ్ రాజ్ నిందితుల చేతికి చిక్కి తీవ్రంగా గాయపడ్డంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ రుద్రాక్ష వరుణ్ రాజ్ మృతి చెందినట్లు తెలిపారు.
దీంతో మృతుని తల్లి రుద్రాక్ష రాజామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కంచరపాలెం పోలీసులు బృందాలుగా ఏర్పడి .ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్, బండి కార్తీక్, మువ్యల శివ శంకర్, కొన్న వైకుంఠరావు, కొప్పర రామకృష్ణ, సారిక ఫణీంద్ర, జొన్నాడ చంద్రశేఖర్, అల్లిపురం సాయికుమార్, అలమండ జగదీష్, బసవ సాయి రోహిత్ రావు, కంకణాల కిరణ్ కుమార్
అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కాగా నిందితుల్లో ఈతలపాక రాజ్ కుమార్, రావాడ జగదీష్ పై రౌడీ షీట్ ఉందని అలాగే బండి కార్తీక్, మువ్వల శివ శంకర్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారని జొన్నాడ చంద్ర శేఖర్, అల్లి పురం సాయి కుమార్, బసవ సాయి రోహిత్ రావు పై హత్య యత్నం కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
కేసులో ప్రతిభ కనబరిచిన కంచరపాలెం సీఐ కే. రవికుమార్, ఎస్ ఐ లు ఎం. రవికుమార్, కే. భాస్కర్ రవు, ఎస్. అజయ్ కుమార్, ఉమెన్ ఎస్ ఐ అరుణ, సి హెచ్ కార్తీక్ లను
నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారని ఏసిపి ప్రదీప్టీ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.