Wednesday, 16 September 2026
  • Home  
  • మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ సమర సన్నాహాలు
- అనకాపల్లి

మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ సమర సన్నాహాలు

ఎలమంచిలి, సెప్టెంబర్ 15 – పున్నమి ప్రతినిధి ఆనంద్: రాబోయే ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన వార్డుల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి వార్డులో పార్టీ బలాబలాలు, ఓటర్ల నమోదు, స్థానిక సమస్యలు, చేరికలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చలపతిరావు సూచించారు. మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురవేసేలా సమన్వయంతో పనిచేయాలని ప్రగడ నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నానాజీ కోరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎలమంచిలి, సెప్టెంబర్ 15 – పున్నమి ప్రతినిధి ఆనంద్:
రాబోయే ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధం కావాలని పార్టీ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన వార్డుల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి వార్డులో పార్టీ బలాబలాలు, ఓటర్ల నమోదు, స్థానిక సమస్యలు, చేరికలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చలపతిరావు సూచించారు. మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురవేసేలా సమన్వయంతో పనిచేయాలని ప్రగడ నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నానాజీ కోరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.