ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా ఖమ్మంకు చెందిన శ్రీమతి మంద సరస్వతి నియమితులయ్యారు.
ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంద సరస్వతి మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మహిళా మోర్చాను జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని శ్రీమతి మంద సరస్వతి తెలిపారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తరించి, మహిళలను అధిక సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసే దిశగా పనిచేస్తానని పేర్కొన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీమతి మంద సరస్వతి కి శుభాకాంక్షలు తెలియజేశారు.



