వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు, అనారోగ్యకర జీవనశైలి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అధిక కొవ్వు శాతం ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి తగ్గుదల, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరిపడ నిద్ర, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర అలవాట్లు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.


