Friday, 17 July 2026
  • Home  
  • మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దు – అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ కీలక ఆదేశాలు
- జయశంకర్ భూపాలపల్లి

మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దు – అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ కీలక ఆదేశాలు

భూపాలపల్లి జూలై 17 ( పున్నమి న్యూస్ ప్రతినిధి) : జిల్లాలో మంచినీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించాలని సూచించారు. పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, ట్యాంకుల శుభ్రత, భూగర్భ జలాల పెంపు చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్స్, ఎస్సీ–ఎస్టీ ఆవాసాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, 99 రోజుల కార్యాచరణలో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

భూపాలపల్లి జూలై 17 ( పున్నమి న్యూస్ ప్రతినిధి) :
జిల్లాలో మంచినీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందించాలని సూచించారు. పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు, ట్యాంకుల శుభ్రత, భూగర్భ జలాల పెంపు చర్యలను వేగవంతం చేయాలని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఫామ్ పాండ్స్, ఎస్సీ–ఎస్టీ ఆవాసాల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, 99 రోజుల కార్యాచరణలో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.