మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల సందడి
పున్నమి ప్రతినిధి కడప: మంగళవారం సందర్భంగా కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకుడు నాగుల సందీప్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తుల నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.











