శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యం, భద్రత, రద్దీ నియంత్రణను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులకు అనుమతి ఇవ్వాలని దేవస్థానం చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ వేలాదిగా తరలివచ్చే భక్తుల్లో వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం లేనివారు ఆన్‌లైన్ టికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి పరిమిత సంఖ్యలో ఆఫ్‌లైన్ విధానంలో టికెట్లు జారీ చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రూ.500 రాహు-కేతు పూజ టికెట్లు, రూ.200, రూ.50 దర్శనం టికెట్లను ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా అందుబాటులో ఉంచడం వల్ల సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఆలయ ప్రాంగణంలో రవాణా, భద్రతా ప్రమాణాలు పెంచేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో గిరి ప్రదక్షిణ చేసే భక్తుల రక్షణ, వెలుతురు సౌకర్యం కోసం రహదారి పొడవునా సోలార్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న వాహన రద్దీని క్రమబద్ధీకరించేందుకు గొడ్డేరు కాలువ జలవినాయక ఆలయం నుంచి 4వ గేట్ వరకు అవసరమైన సమయాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టేందుకు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల సహకారాన్ని కోరారు. ఈ ప్రతిపాదనల అమలుతో క్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని, ప్రతిపాదిత పనులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కమిషనర్‌ను కోరారు.

భక్తుల సౌకర్యార్థం కీలక సదుపాయాలు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ని కోరిన దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి