బిజినేపల్లి మండలంలో సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. పాలెం, మంగనూరు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. భారీగా ఉరుములు, మెరుపులు వస్తుండటంతో పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులను హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని స్థానిక అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:

