లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లు అందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి
బిక్కవోలు, సెప్టెంబరు 1 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ మొత్తాలను అందజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడంతో వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



