పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఎస్.రాయవరం మండల పరిధిలోని పెద్ద ఉప్పలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ పాల్గొని విద్యార్థులకు పలు చట్టాలు, ప్రస్తుత సామాజిక సమస్యలపై దిశానిర్దేశం చేశారు.
బాల్య వివాహాల నిరోధం: బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం విధించే కఠిన శిక్షల గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు – సోషల్ మీడియా ప్రభావం: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై అప్రమత్తత అవసరమని తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్, మోసపూరిత లింకులు, లోన్ యాప్‌ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. సమాజంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ, సత్ప్రవర్తన ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు తమ సమయాన్ని చదువు, ఉజ్వల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఏదైనా సైబర్ మోసం లేదా ఆపద ఎదురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 1930 లేదా 112కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు


