ఖమ్మం, జూన్
(పున్నమి జిల్లా ప్రతినిధి – పువ్వాడ నాగేంద్ర కుమార్)
ప్రముఖ సినీ నటుడు,ఆంధ్రప్రదేశ్ హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మంకు చెందిన బాలయ్య అభిమాన సంఘ నాయకుడు నల్లమల్ల రంజిత్ బుధవారం హైదరాబాద్‌లో బాలకృష్ణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో తాను నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి నల్లమల్ల రంజిత్ బాలకృష్ణకు వివరించారు. సేవా కార్యక్రమాల పట్ల రంజిత్ చూపుతున్న నిబద్ధతను బాలకృష్ణ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తారక్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



