రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి విజయాన్ని సాధించాలని రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి, కూడ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలోని టిడిపి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని రూపానంద రెడ్డి సూచించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం పెంచుకుని ప్రజల్లోకి వెళ్లాలని కోరారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరికైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆయన భరోసా ఇచ్చారు. వాటిపై సమగ్రంగా చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు లేదా ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఓబులవారిపల్లి టిడిపి నాయకుల సమావేశంలో ముక్కా రూపానంద రెడ్డి పిలుపు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి విజయాన్ని సాధించాలని రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి, కూడ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలోని టిడిపి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సమస్యలు, ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా ఐక్యంగా పనిచేయాలని రూపానంద రెడ్డి సూచించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం పెంచుకుని ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరికైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆయన భరోసా ఇచ్చారు. వాటిపై సమగ్రంగా చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు లేదా ఇతర సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాలని నాయకులకు సూచించారు. సమావేశంలో మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

