ఖమ్మం, జూన్
( పున్నమి జిల్లా ప్రతినిధి
పువ్వాడ నాగేంద్ర కుమార్ )
వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా దీర్ఘకాలం సేవలందించిన 2000 బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది పోలీస్ అధికారులకు హెడ్ కానిస్టేబుల్ హోదాకు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాలను అలంకరించి వారికి అభినందనలు తెలిపారు.
ఉద్యోగున్నతి పొందిన అధికారులకు కొత్త బాధ్యతల పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పదోన్నతి పొందిన వారిలో ఇద్దరు ఖమ్మం జిల్లాకు, ఒకరు మహబూబాబాద్ జిల్లాకు, నలుగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, ఒకరు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీపై వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు సీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.



