Sunday, 24 May 2026
  • Home  
  • ఫార్మాసిటీ రోడ్డు పేరుతో గ్రామాల్లో దుమ్ము దూళి రాజ్యం..! మేడిపల్లి – నక్కర్త గ్రామ ప్రజల ఆవేదన
- E-పేపర్

ఫార్మాసిటీ రోడ్డు పేరుతో గ్రామాల్లో దుమ్ము దూళి రాజ్యం..! మేడిపల్లి – నక్కర్త గ్రామ ప్రజల ఆవేదన

ఫార్మాసిటీ రోడ్డు పేరుతో గ్రామాల్లో దుమ్ము దూళి రాజ్యం..! మేడిపల్లి – నక్కర్త గ్రామ ప్రజల ఆవేదన పున్నమి న్యూస్ 24 మే 2026 తెలంగాణ ఇంచార్జి రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి, నక్కర్త గ్రామాల్లో ఫార్మాసిటీ రోడ్డు పనుల పేరుతో భారీ మట్టి టిప్పర్లు నిరంతరం గ్రామాల మధ్య సంచరిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వాహనాలు వేగంగా తిరుగుతూ దుమ్ము, ధూళిని ఎగరేస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ రహదారులపై నీళ్లు చల్లకపోవడం, నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో ఇళ్లలోకి దుమ్ము చేరి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల ప్రశ్నలు ఇవే… గ్రామాల్లో ఇంత భారీ టిప్పర్లు నడపడం తప్పనిసరిగా మారిందా..? ప్రజల ఆరోగ్యం కంటే పనులే ముఖ్యమా..? రాత్రి వేళల్లో టిప్పర్లు నడిపితే కాదా..? దుమ్ము తగ్గించే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అధికారులు, పాలకవర్గం ఎందుకు మౌనం పాటిస్తున్నారు..? గ్రామ ప్రజల డిమాండ్లు గ్రామ రహదారులపై ప్రతిరోజూ నీళ్లు చల్లాలి టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలి పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను తగ్గించాలి గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి “మా ఊరు – మా ఆరోగ్యం – మా హక్కు” గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…!

ఫార్మాసిటీ రోడ్డు పేరుతో గ్రామాల్లో దుమ్ము దూళి రాజ్యం..!

మేడిపల్లి – నక్కర్త గ్రామ ప్రజల ఆవేదన

పున్నమి న్యూస్
24 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి, నక్కర్త గ్రామాల్లో ఫార్మాసిటీ రోడ్డు పనుల పేరుతో భారీ మట్టి టిప్పర్లు నిరంతరం గ్రామాల మధ్య సంచరిస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వాహనాలు వేగంగా తిరుగుతూ దుమ్ము, ధూళిని ఎగరేస్తుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామ రహదారులపై నీళ్లు చల్లకపోవడం, నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో ఇళ్లలోకి దుమ్ము చేరి ప్రజల జీవనం దుర్భరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థుల ప్రశ్నలు ఇవే…
గ్రామాల్లో ఇంత భారీ టిప్పర్లు నడపడం తప్పనిసరిగా మారిందా..?
ప్రజల ఆరోగ్యం కంటే పనులే ముఖ్యమా..?
రాత్రి వేళల్లో టిప్పర్లు నడిపితే కాదా..?
దుమ్ము తగ్గించే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?
అధికారులు, పాలకవర్గం ఎందుకు మౌనం పాటిస్తున్నారు..?
గ్రామ ప్రజల డిమాండ్లు
గ్రామ రహదారులపై ప్రతిరోజూ నీళ్లు చల్లాలి
టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలి
పగటి వేళల్లో భారీ వాహనాల రాకపోకలను తగ్గించాలి
గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలి
సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి
“మా ఊరు – మా ఆరోగ్యం – మా హక్కు”
గ్రామ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.