మండలంలోని కాండ్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్, అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందున్న ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.
ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ వెంకటేష్
మండలంలోని కాండ్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వెంకటేష్, అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్తులకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చెత్త బుట్టలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందున్న ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు.

